పోలీసులకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్నింగ్..ఇచ్చారు. మళ్లీ వచ్చేది మన రాజ్యమేనని…. మన రాజ్యంలో అందరి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. అందరి పేర్లు పింక్ బుక్ లో ఎక్కిస్తున్నామని… అందరిపై యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

కచ్చితంగా ఇంతకు నాలుగింతలు అనుభవిస్తారు… ఇకనైనా మీ పద్దతి మార్చుకోండి అని ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. దీంతో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి పోలీసు సంఘం నేతలు కౌంటర్ ఇచ్చారు. గత నెల రోజుల నుంచి పోలీసులను టార్గెట్ చేస్తూ జీవన్ రెడ్డి పోలీసులను బెదిరిస్తున్నారు… పింక్ బుక్ లో మీ పేర్లు రాస్తున్నాం వచ్చేది మా ప్రభుత్వమే అంటూ బెదిరిస్తున్నారన్నారు.
కేసీఆర్ పాటలతో డీజేలు పెడితే ఎందుకు కేసులు పెట్టారని అడిగారు…సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం హై వాల్యూమ్ డీజేలపై నిషేధం ఉందని వివరించారు. పోలీసులకు ఏ పార్టీతో దగ్గరి సంబంధాలు ఉండవు…లా అండ్ ఆర్డర్ మెయిన్ టైన్ చేయడానికే పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని ఫైర్ అయ్యారు.