మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద వరద ప్రవాహం విపరీతంగా పెరగడంతో అధికారులు ఆలయాన్ని మరోసారి మూసివేశారు. 27 రోజులుగా వనదుర్గ ఆలయం వరద ముంపులో ఉండగా మూడు రోజుల క్రితమే ఆలయాన్ని తీశారు. పూజల అనంతరం అమ్మవారి మూలవిరాట్ దర్శనాలను పునః ప్రారంభించారు. కానీ జిల్లాలలో కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం అధికంగా రావడంతో పొంగి పొర్లు పొర్లుతుండడంతో ఆలయాన్ని అధికారులు మూసివేశారు.

కాగా, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలలో గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాలలో జల్లులతో కూడిన వర్షాలు కురవగా మరికొన్ని ప్రాంతాలలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న వారు అధికారులను ఆదుకోమని వేడుకుంటున్నారు. గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల వారు భారీ మొత్తంలో ఆస్తి నష్టాన్ని చవిచూశారు.