ఏపీ వాసులకు శుభవార్త అందజేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దసరా కానుకగా ఏపీలోని ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం రూ. 15 వేల ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన రూ, 10,000 సాయాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15 వేలకు పెంచింది. స్త్రీ శక్తి పథకంతో ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తీసుకువచ్చారు. దీంతో ఆటో డ్రైవర్లు స్త్రీ శక్తి పథకంపై ఆందోళన చేపట్టారు.

దీంతో కూటమి ప్రభుత్వం అర్హులైన ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందడుగు వేసింది. వాహన మిత్ర పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. గతంలో వాహన మిత్ర ద్వారా లబ్ధి పొందిన వారి సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. కొత్తగా వాహనాలు నడుపుతున్న వారి సమాచారం సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. సమాచారం సేకరించిన అనంతరం దసరా కానుకగా 15 వేల ఆర్థిక సహాయం అందించనున్నారు. సంవత్సరానికి రూ. 15,000 ఆటో డ్రైవర్ల అకౌంట్లలో పడనున్నాయి.