ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం సరికొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ద్వారా రేషన్ సరుకులు మరింత సులభంగా ప్రజలు పొందవచ్చు. కార్డులలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మనమిత్ర వాట్సాప్ ద్వారా సరిచేసుకునే అవకాశాన్ని తీసుకువచ్చారు. అంతేకాకుండా కొత్త ఈ-పోస్ట్ యంత్రాలు రావడంతో రేషన్ పంపిణీ కార్యక్రమం మరింత సులువు కాబోతోంది. అయితే ఈ నెల సెప్టెంబర్ 15 నుంచి మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా మార్పులు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

ఈ మేరకు రేషన్ కార్డులలో తప్పులను సవరించిన వారికి కొత్త కార్డులు ఇవ్వనున్నారు. ఆధార్, ఈ-కేవైసీ వివరాలతో కొత్త రేషన్ కార్డులను ముద్రించారు. నవంబరు ఒకటి తర్వాత కొత్త కార్డులు రావాలంటే దానికోసం రూ. 35 నుంచి రూ. 50 రూపాయల మధ్య రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఇలా చేసినట్లయితే ఇంటికే రేషన్ పంపిణీ చేయనున్నారు. దీంతో ఏపీ వాసులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నారని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.