టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య రేపు మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్టీ-నేషనల్ టోర్నమెంట్లు ACC లేదా ICC నిర్వహించినప్పుడు.. వాటిల్లో తప్పకుండా పాల్గొనాల్సి వస్తుందని వెల్లడించారు.

లేకపోతే టోర్నీ నుంచి తప్పిస్తారు.. దాంతో వేరే జట్లు లాభం పొందుతాయని స్పష్టం చేశారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. ఇది ఒక సిగ్గుమాలిన స్టేట్మెంట్ అంటూ విమర్శలు చేశారు. అసలు క్రికెట్‌తో దేశానికి లాభమేంటని జనం ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ, సోనీ టీవీలను బ్యాన్ చేయాలని ట్రెండ్ చేసింది బీజేపీ ఐటీ సెల్. ఇక ఇప్పుడు అనురాగ్‌పై కూడా అలాంటి ట్రెండే నడపగలరా? అంటూ ప్రశ్నిస్తున్నారు జనం. కాగా.. రేపు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా రాత్రి 8 గంటలకు టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించనున్నారు.