వరంగల్ కాంగ్రెస్ పార్టీలో గొడవలు ముదురుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. అదృష్టం కొద్ది గెలిచిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి…. ఆయన గురించి కామెంట్ చేయడం అనవసరం అంటూ చురకలు అంటించారు. దేవదాయ శాఖ మంత్రిగా ఇద్దరికి పదవులు ఇచ్చే స్వేచ్ఛ నాకు లేదా అంటూ ఫైర్ అయ్యారు.

అధిష్టానం నుంచి వచ్చిన పేర్లనే భద్రకాళి ధర్మకర్తల మండలిలో ఫైనల్ చేశానని వివరించారు మంత్రి కొండా సురేఖ. నా వెంట తిరిగే వాళ్ళు ఎవరికీ ధర్మకర్తల మండలిలో నేను పదవులు ఇవ్వలేదన్నారు. కాగా, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య ధర్మకర్తల మండలి నియామకం చిచ్చుపెట్టింది. తన నియోజకవర్గంలోని భద్రకాళి ఆలయ ధర్మకర్తలుగా అదనంగా ఇద్దరిని నియమిస్తూ దేవాదాయ శాఖ జీవో జారీ చేసింది. తన ప్రమేయం లేకుండా ధర్మకర్తలను నియమించారని కొండా సురేఖపై మండిపడ్డారు నాయిని. దీంతో కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు.