పాకిస్థాన్ – టీమిండియా మ్యాచ్ పై అసదుద్దీన్ ఒవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ పై అసదుద్దీన్ ఒవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక క్రికెట్ మ్యాచ్‌ని ఆపలేనంత బలహీనమైందా బీజేపీ నాయకుల దేశభక్తి..? అంటూ నిప్పులు చెరిగారు. బ్లడ్ & వాటర్ కలిసి ప్రవహించవని మోదీ చెప్పారు.. మరి క్రికెట్ & ఉగ్రవాదం ఎలా కలిశాయి ? అని ఆగ్రించారు.

suryakumar yadav
Asaduddin Owaisi’s emotional comments on the Pakistan-India match

పహల్గాం దాడిలో అమరు లైన 26 మంది ప్రాణాల కన్నా క్రికెట్ నుంచి వచ్చే డబ్బులు ముఖ్యమా? అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశభక్తి గురించి పెద్ద పెద్ద ప్రసంగాలిచ్చే బీజేపీ నేతలు.. క్రికెట్ దగ్గరికి వచ్చేసరికి స్టంప్ ఔట్ అయ్యారని ఆగ్ర‌హించారు. అదే దాడిలో నీ కూతురో, వేరే కుటుంబ సభ్యులో చనిపోతే.. పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడేవాళ్లా ?  మమ్మల్ని నోటీసులిచ్చి పంపుతామనే ఒడిశా సీఎం హిమంత.. ముందు క్రికెట్ ఆపే ధైర్యం చూపించు అంటూ అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news