గుంటూరు నగరంలో క్లౌడ్ బరస్ట్ తరహా వర్షం విపరీతంగా కురుస్తోంది. కేవలం 25 నిమిషాల్లోనే 50 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు అయింది. దీంతో గుంటూరు నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. గుంటూరులో మరో గంట పాటు ఇదే విధంగా వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు ఎట్టి పరిస్థితులలో ఇంట్లో నుంచి బయటకు రాకూడదని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అమరావతి, సత్తెనపల్లి, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి.

మరికాసేపట్లోనే తెలంగాణలోని పలు జిల్లాలలో వర్షం కురుస్తుందని అధికారులు సూచనలు జారీ చేశారు. తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఎడతెరపి లేకుండా రెండు మూడు గంటల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజుల నుంచి జల్లులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అధికారులు సూచనలు జారీ చేశారు.
గంట నుంచి pic.twitter.com/Km72P18NUp
— Dr.Nagaraju M🚩 (@nagaraj148) September 14, 2025