దుద్దిళ్ల శ్రీపాదరావుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీ పాదరావుది మొత్తం నీచ చరిత్ర, వ్యభిచార చరిత్ర అంటూ ఆగ్రహించారు. ఆయన స్పీకర్ అయ్యేంత వరకు కూడా చినిగిపోయిన లాగు వేసుకుని ఆర్టీసీ బస్సులో తిరిగేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు.

బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే శ్రీపాద రావు విగ్రహాలన్నీ తొలగిస్తానని హెచ్చరించారు. వాటి చోట బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. ఎవడు అడ్డొస్తాడో ఏ పోలీస్ అడ్డుకుంటాడో చూస్తానని వార్నింగ్ ఇచ్చారు పుట్టా మధు.