ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఈ మ్యాచ్ ను ఏర్పాటు చేశారు. ఇందులో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా తన ఆట తీరును కొనసాగించాడు. పాకిస్తాన్ పై విజయం సాధించిన అనంతరం హోటల్ కు తిరిగివచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తన భార్య దేవిశెట్టి నుంచి ఘన స్వాగతం లభించింది.

ఆదివారం సూర్యకుమార్ యాదవ్ బర్త్ డే కావడంతో స్పెషల్ గా తన భార్య కేక్ కట్ చేయించారు. అంతేకాదు ఆయన నుదుటిపై కేకుతో తిలకం దిద్దారు. దీనికి సంబంధించిన ఫోటోలను దేవి తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసుకున్నారు. “హ్యాపీ బర్త్డే మై స్పెషల్ వన్” అని రాసుకోచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా సూర్య కుమార్ యాదవ్ కు తన అభిమానులు, సెలబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.