తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి యాదాద్రి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే విజయనగరం ప్రకాశం పల్నాడు, బాపట్ల గుంటూరు, శ్రీకాకుళం మన్యం కృష్ణ ఎన్టీఆర్ నంద్యాల అనంతపురం శ్రీ సత్య సాయి తిరుపతి నెల్లూరు కర్నూలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.