ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. పెన్నా నదిలో 10 మంది యువకులు చిక్కుకుపోయారు. నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ వద్ద పెన్నా నదిలో యువకులు చిక్కుకుపోయారు. పేకాట ఆడేందుకు నది మధ్యలోకి వెళ్లిన యువకులు…పెన్నా నదిలో చిక్కుకుపోయారు.

సోమిశిల డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసిన క్రమంలో ఒక్కసారిగా నదిలో చుట్టుముట్టింది నీరు. ఇకస్థానికల సమాచారంతో నది మధ్యలో ఇరుక్కుపోయిన వారిని రక్షించారు అధికారులు. ఈ సంఘటన కు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.