తెలంగాణలో మెట్రోలో ట్రాన్స్ జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో 20 మంది ట్రాన్స్ జెండర్లకు నియామక పత్రాలను మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు. ట్రాన్స్ జెండర్లకు అండగా నిలవాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. సమాజంలో ట్రాన్స్ జెండర్లు గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని కల్పించామని సీఎం పేర్కొన్నారు.

ట్రాన్స్ జెండర్ల అభివృద్ధి, అభ్యున్నతికి కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాగా, తెలంగాణలో మెట్రోల ద్వారా ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు. చాలా తొందరగా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా…. ఇప్పటికే ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ పోలీసులుగా నియమించారు. ఎంతోమంది ట్రాన్స్ ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశాలను కల్పించి వారికి అండగా నిలిచారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు మరోసారి ట్రాన్స్ ట్రాన్స్ జెండర్లకు ఈ అవకాశం కల్పించడంతో వారు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు.