మహిళల ఆరోగ్యం కోసం మోడీ సరికొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా మహిళల ఆరోగ్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. “స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్” పేరిట హెల్త్ క్యాంపులను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు మహిళలకు పలు వైద్య పరీక్షలను చేస్తారు. PHC మొదలు బోధన ఆసుపత్రుల వరకు 15 రోజులపాటు ఈ క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు.

ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈరోజు మధ్యప్రదేశ్ లో ప్రారంభించబోతున్నారు. మహిళల కోసం నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు చెబుతున్నారు. నరేంద్ర మోడీ ప్రజల కోసం ఎన్నో రకాల మంచి పనులను చేస్తున్నారు. కాగా, ఈ క్యాంపులను అన్నిచోట్ల ఏర్పాటు చేయాలని అధికారులు చూస్తున్నారు. క్యాంపుల ద్వారా మహిళలకు వైద్య పరీక్షలు చేసి వారి ఆరోగ్య విషయాలను వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఏమైనా వ్యాధులు ఉన్నట్లయితే దానికి తగిన విధంగా మందులను కూడా అందిస్తామని చెప్పారు.