ఏపీ ప్రజలకు అలర్ట్…ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్, ఫుడ్ ఫెస్టివల్ లను నిర్వహించనున్నారు. ఈనెల 27న సీఎం చంద్రబాబు బీచ్ ను సందర్శించి పలు అభివృద్ధి పనులకు రూ. 97 కోట్లతో శంకుస్థాపన పనులను ప్రారంభిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.

బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదిలా ఉండగా…. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నారు. ప్రజలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకువస్తూ వారికి ఉపయోగపడే పనులను చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన పాలన బాగుందని ప్రజలు మెచ్చుకుంటున్నారు. తొందరలోనే ఏపీలో డీఎస్సీ పరీక్షలలో విజయం సాధించిన వారికి ఉద్యోగాలను కేటాయించాను అన్నారు.