నేటి కాలంలో హత్యలు చేయడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా స్త్రీలు, పురుషుల మధ్య గొడవలు విపరీతంగా పెరిగిపోయాయి. భర్తపై అతి కిరాతకంగా భార్యలు హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకీ అనేక రకాలుగా బయటకు వస్తున్నాయి. ఎన్నో రకాల చట్టాలు అమలులో ఉన్నప్పటికీ స్త్రీలు, పురుషులు ఏమాత్రం భయపడకుండా భర్తలను హత్య చేయడం, భార్యలను హత్య చేయడం చాలా కామన్ అయిపోయింది.
ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న వారిని ఈ లోకాన లేకుండా చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మూడు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్న మహిళను ఓ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా జాలరిపేటలో జరిగింది. ఒలిశెట్టి కోదండ (40) అనే వ్యక్తి లక్ష్మి (45) అనే మహిళతో మూడు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు విపరీతంగా పెరిగాయి. మరోసారి ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం చెలరేగింది. మద్యం తాగిన మత్తులో ఉన్న కోదండ కూరగాయలు కోసే కత్తితో లక్ష్మిని అతి కిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం మృతదేహం పక్కనే ఉన్న మంచంపై దర్జాగా నిద్రపోయాడు. స్థానికులు విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.