క‌డియంకు షాక్..లైవ్ లోనే ఆ కాగితాలు త‌గ‌ల‌బెట్టిన తాటికొండ రాజ‌య్య‌

-

కడియం శ్రీహరి విడుదల చేసిన ప్రొసీడింగ్ కాపీ తగలబెట్టారు తాటికొండ రాజయ్య. కనీసం ప్రొసీడింగ్ కాపీ మీద సంతకం పెట్టడానికి కూడా ధైర్యం లేని పిరికోడు కడియం శ్రీహరి అంటూ ఫైర్ అయ్యారు తాటికొండ రాజయ్య. శ్రీ హరి నిన్న విడుదల చేసి కాగితం కేవలం చిత్తు కాగితం.. అది ప్రొసీడింగ్ కాపీ కాదు, కేవలం ప్రపోజల్ మాత్రమేన‌న్నారు.

Thatikonda Rajaiah burns the copy of the proceedings released by Kadiyam Srihari
Thatikonda Rajaiah burns the copy of the proceedings released by Kadiyam Srihari

కనీసం సంతకం పెట్టే ధైర్యం లేని పిరికివాడు కడియం శ్రీహరి అని ఆగ్ర‌హించారు తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. ప్రజల అభీష్టం మేరకే కడియం పార్టీ మారి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జెండా పట్టుకుని తెలంగాణ మొత్తం తిరగాలని.. పూలదండలు వేస్తారో లేక చెప్పుల దండ వేస్తారో కడియం సిద్ధంగా ఉండాలని కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news