తెలంగాణ‌లో 15 ఏళ్లు కాంగ్రెస్ పార్టీదే అధికారం -మెట్టు సాయికుమార్

-

కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఐదేళ్లు, వచ్చే పదేళ్లు కలిపి.. మొత్తం 15 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో అధికారంలో ఉంటుందని బాంబ్ పేల్చారు ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని 31 జిల్లాల్లో క్వీన్ స్వీప్ చేస్తుందన్నారు.

mettu saikumar
mettu saikumar

రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోందని… 31 జిల్లాల్లో.. గతంలో కన్నా ఎక్కువ ఓట్ల శాతంతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వెల్ల‌డించారు. సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకంతో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 30 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తుంద‌న్నారు ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్.

Read more RELATED
Recommended to you

Latest news