తెలంగాణలోని ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కొఠగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ జిల్లాలలో అకస్మాత్తుగా వర్షాలు పడే అవకాశముందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ తరుణంలోనే…వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా ఇవాళ భారీ వర్షం పడే ప్రమాదం పొంచి ఉందట. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ద్రోణి ప్రభావం కారణంగా నెల్లూరు, కర్నూలు, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.