ఇవాళ 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ

-

ప్రధాని మోదీ కార్యాల‌యం నుంచి కీల‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇవాళ‌ సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించ‌నున్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచే అమల్లోకి జీఎస్టీ 2.0 రానుంది. ఈ జీఎస్టీ సంస్కరణలపై మోదీ ప్రసంగించే అవకాశం ఉంది.

Prime Minister Modi will address the nation at 5 pm today
Prime Minister Modi will address the nation at 5 pm today

అమెరికాతో వాణిజ్య చర్చలు, పెరిగిన హెచ్1బీ వీసా రుసుముపై మాట్లాడే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది.

జీఎస్టీ 2.0 పై ప్రధాన ఫోకస్

ఈరోజు అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్న జీఎస్టీ 2.0 సంస్కరణల పై ప్రధాని వివరించే అవకాశముంది. కొత్త మార్పులు వ్యాపార రంగం, సాధారణ ప్రజలపై ఎలా ప్రభావం చూపుతాయన్న దానిపై మోడీ స్పష్టతనివ్వనున్నారు.

అమెరికా వాణిజ్య చర్చలు

ఇటీవల అమెరికాతో జరిగిన వాణిజ్య చర్చలపై, అలాగే పెరిగిన హెచ్1బీ వీసా రుసుముల అంశంపై కూడా ప్రధాని స్పందించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news