దెయ్యాలు, ఆత్మలు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయో తెలుసా..?

-

దెయ్యాల గురించి, ఆత్మల గురించి మాట్లాడుకోవడం అంటే అందరికీ భలే ఇష్టం ఉంటుంది కదా..! వాళ్లకు అక్కడ దెయ్యం కనిపించిందట, ఆ అమ్మాయికి మొన్న దెయ్యం పట్టిందట.. అసలు ఊర్లలో ఈ ముచ్చట్లు చెప్తుంటే.. మజాగా వింటుంటాం.. దెయ్యాలు కొందరికే కనిపిస్తాయి తెలుసు.. అందరూ దెయ్యాలను చూడలేరు. ఎందుకు కొందరికే దయ్యాలు కనిపిస్తాయనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..!

కొంత మంది దయ్యాలు లేవని వాదిస్తే.. కొంతమంది ఉన్నాయని అంటారు. కేవలం అనడం మాత్రమే కాదు, తామూ చూశామని చాలా కచ్చితంగా కూడా చెబుతారు. మరి మీరేమంటారు దయ్యాలు లేవంటారా లేదా మీరు కూడా దయ్యాన్ని చూశానని అంటారా? ఒక వేళ చూసి ఉంటే జనాభాలో 18 శాతం మంది దయ్యాలను చూశామని గట్టిగా వాదించే వారిలో మీరు ఒకరు. దయ్యాలు లేదా ఆత్మలు కనిపించాలంటే ముందు వాటి పట్ల విశ్వాసం ఉండాలట. ఒక సామాజిక శాస్త్రవేత్త క్రిప్టోఫర్ మాట్లాడుతూ ‘‘ఇంట్లో దయ్యం ఉండాలంటే ముందుగా ఇంట్లో ఎవరో ఒకరు ఇంట్లో దయ్యం ఉందని నమ్మాలి.’’ అని అన్నారు. మన ఆలోచనలు, అంచనాలు, మన ఇంద్రియ స్పందన వంటివన్నీ కలిసి మన పరిసరాలలో జరిగే విషయాలను రిసీవ్ చేసుకునే విధానం ఆధారపడి ఉంటుంది.

మన చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రమాదం ఉందని కచ్చితంగా తెలియనపుడు, ఒక అనిశ్చితి ఉన్నపుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాం. అలాంటి ప్రదేశాల నుంచి ముందుగా బయటపడాలని అనుకుంటాం. ఇలాంటి స్పందన మనల్ని పారానార్మల్ విషయాల మీద మరింత నమ్మకానికి కారణం అవుతుంది. ఈ నమ్మకమే మనకు దయ్యాలు కనిపించేందుకు కారణం అవుతుంది. 2013లో ప్రచురితమైన ఒక అధ్యయనం అతీంద్రియ అనుభవాలు చాలా వరకు భయం గొలిపే లేదా అస్పష్టమైన పరిసరాల్లోనే ఎక్కువగా ఎదురవుతాయని తీర్మానించింది.

దయ్యాల మీద నమ్మకం ఉన్న వారికి కీచురాళ్ల శబ్దాలు, తలుపుల చప్పుడు వంటివి పారానార్మల్ శక్తుల పనిగా అనిపిస్తే అటువంటి నమ్మకం లేని వారు లాజిక్‌ల కోసం వెతుకుతారు. ఇలా పారానార్మల్ నమ్మకాల వల్లే చాలా మంది దయ్యాలను చూడడం సాధ్యపడుతుంది. పూర్తి జనాభాలో కనీసం 75 శాతం మందిలో కనీసం ఒకరైనా పారానార్మల్ నమ్మకం కలిగి ఉన్నారని, 50 శాతం మంది పారానార్మల్ నమ్మకాలు కలిగి ఉన్నారని ఒక సర్వేలో తేలిందట.

సైకాలజిస్ట్‌లు ఈ పారానార్మల్ నమ్మకాలను అంచనా వేసేందుకు ఉపయోగించే పద్దతి రివైజ్డ్ పారానార్మల్ బిలీఫ్ స్కేల్. దీనిని జెరోమ్ టోబాసిక్ లో ప్రచురించారు. ఈ స్కేల్ పారానార్మల్ నమ్మకాన్ని ఆరు వర్గాలు గా విభజించి కొలుస్తుంది.

దయ్యాలు, ఆత్మలు, అతీంద్రీయ శక్తుల గురించిన నమ్మకాలు స్త్రీలలో ఎక్కువగా ఉంటాయట. ఇలాంటి నమ్మకాలకు పసితనంలో ఏర్పడిన ట్రామా కూడా కారణం అయ్యే ఆస్కారం ఉందని మానసిక నిపుణులు అంటున్నారు. మొత్తానికి చెప్పేది ఏంటంటే.. మీరు ఏదైతే నమ్ముతారో అదే జరుగుతుంది. దేవుడు ఉన్నాడని నమ్మితే..ఆ వైబ్స్‌ మనకు తెలుస్తాయి.. అలాగే దెయ్యాలు కూడా..!

Read more RELATED
Recommended to you

Latest news