నటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగు, తమిళం, మలయాళంలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు అనేక సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. ఈ మధ్యకాలంలో ఈ చిన్నది ఎక్కువగా సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపించనట్టుగా సమాచారం అందుతుంది. తాజాగా ఈ బ్యూటీ కిష్కిందపురి సినిమాలో నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. అందులో అనుపమ పరమేశ్వరన్ పాల్గొని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. అందులో భాగంగా మాట్లాడుతూ తనకు సంబంధించిన ఎమోషనల్ మూమెంట్ ను గుర్తు చేసుకున్నారు. ఒక క్లోజ్ ఫ్రెండ్ తో మనస్పర్ధలు కారణంగా మాట్లాడకపోవడం అతని మెసేజ్లను పట్టించుకోకపోవడం జరిగిందని అన్నారు.
రెండు రోజుల తర్వాత అతని మరణవార్తను విని చాలా బాధపడ్డానని, ఎమోషనల్ అయ్యానని అనుపమ చెప్పారు. తన జీవితంలో ఇది అత్యంత ఎమోషనల్ మూమెంట్ అని చెప్పారు. ఒక వ్యక్తి మనతో ఉన్నప్పుడు ప్యాచ్అప్ అవ్వడం ఎంత ముఖ్యమో జీవితంలో తెలుసుకున్నానని అనుపమ ఎమోషనల్ అవుతూ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తన తదుపరి సినిమా షూటింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. అనుపమ ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.