బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం అఖండ-2. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఏకంగా 600 మంది డ్యాన్సర్లతో ఓ మాస్ సాంగ్ ను షూట్ చేస్తున్నారని దీనికోసం స్పెషల్ గా సెట్ కూడా వేసినట్లుగా సినీ సర్కిల్స్ లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.

కాగా, ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ-2 సినిమాను తెరకెక్కించనున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమాతో బాలకృష్ణ మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటారని తన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.