పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం “ఓజీ”. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు ఉదయం 10:08 నిమిషాలకి రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. దాంతో తన అభిమానులు ఓజీ సినిమా ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఎదురుచూపులకు నిరాశ మాత్రమే మిగిలింది. ఈరోజు ఉదయం రిలీజ్ కావాల్సిన ట్రైలర్ ను పోస్ట్ పోన్ చేశారు.

దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం జరిగే కాన్సర్ట్ లో ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఓజీ సినిమా నిర్మాత డివివి దానయ్య వెల్లడించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు కాస్త ఊరట లభించింది. ఈరోజు సాయంత్రం సినిమా ట్రైలర్ విడుదల అవుతుందని దానికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో అయినా పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటారో లేదో చూడాలి.