తెలంగాణలోని రైతులకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి సర్కార్. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల చివరి నుంచి వరి కోతలు మొదలు కానున్న నేపథ్యంలో అక్టోబర్ మొదటివారం నుంచి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సంవత్సరం దాన్యం కొనుగోలు ప్రక్రియ నాలుగు నెలల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సన్న ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది.

గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్వింటాలుకు రూ 500 చొప్పున బోనస్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా… మరోవైపు తెలంగాణలో యూరియా కొరత ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సమస్యను తొందరలోనే నివారించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంతగానో కోరుతున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు వారి ప్రాణాలను కూడా కోల్పోయారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఈ విషయం పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.