ఇప్పుడు టాలీవుడ్ లో పూజ హెగ్డే హవా నడుస్తుంది. వరుసగా సినిమాలు చేస్తూ ఈ భామ దూసుకుపోతుంది. ఈ ఏడాది వరుస విజయాలతో ఊపు మీద ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు ప్రభాస్ పక్కన ఒక సినిమా చేస్తుంది. అఖిల్ హీరోగా కూడా ఒక సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాలు ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పడు రేటు కూడా భారీగా పెంచింది పూజ.
ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈమె తమిళంలో కూడా వరుస ఆఫర్లు దక్కించుకుంటుంది. సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో సూర్య కి జంటగా పూజ హెగ్డే ని తీసుకొనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. హిందీలో సల్మాన్‌తో పాటు అక్షయ్ సినిమాలో కూడా పూజా నటించనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
తెలుగులో దాదాపు అగ్ర హీరోలు అందరితో సినిమాలు చేసింది. ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాలతో చేస్తుంది. అల్లు అర్జున్ సరసన ‘డీజే’ లోహాట్‌గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’లో నటించింది. మహేష్ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకుంది. ఇక్కడి నుంచి ఈమెకు డిమాండ్ భారీగా పెరిగింది.