కరోనా వైరస్ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేంద్రానికి కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలకు తలో 50 లక్షల మేర ఆయన ట్రాన్సఫర్ చేసారు. ఈ విషయాన్ని పవన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇటీవల ఆయన కేంద్రానికి కోటి రూపాయలు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు ఇస్తాను అని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
మాట ప్రకారం పీఎంకేర్ ఫండ్‌కు రూ.కోటి విరాళాన్ని ఆయన పంపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన బ్యాంక్ అకౌంట్‌కు రూ.కోటి రూపాయలను పవన్ కళ్యాణ్ ట్రాన్స్‌ఫర్ చేశారు. విరాళం అందించిన వివరాలతో పాటు పవన్ కళ్యాణ్ ఆయన ప్రజలకు ఒక సందేశం కూడా ఇచ్చారు. కరోనాపై యావత్ భారతదేశం చేస్తున్న పోరాటానికి మనవంతు ఆర్థిక చేయూతను అందిద్దామని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మరింత బలంగా కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం పోరాడేందుకు ప్రధానికి చేయూతను అందించి నైతిక బాధ్యత నిర్వర్తిద్దామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కూడా చెరో రూ.50 లక్షలను ట్రాన్స్‌ఫర్ చేసిన పవన్ ఈ విషయాన్ని కూడా ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ పై పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.
I have just transferred Rs.1crore, to PM-CARES fund ,as a part of my Rs.2 crore, commitment to fight against covid-19 pandemic.@PMOIndia @VMBJP @mepratap @Tejasvi_Surya @BJP4Andhra @JanaSenaParty @BJP4India @v_shrivsatish @Sunil_Deodhar @rsprasad @DrTamilisaiGuv @nsitharaman pic.twitter.com/j6Uow8ZWTX
— Pawan Kalyan (@PawanKalyan) April 3, 2020