స్మోక్-ఫ్రీ నేషన్: 2007 తర్వాత పుట్టిన వారికి సిగరెట్ అమ్మకాలు పూర్తిగా నిషేధం!

-

ప్రపంచ దేశాలు పౌరుల ఆరోగ్య పరిరక్షణకు వినూత్నంగా అడుగులు వేస్తున్నాయి. ఈ పరంపరలో సుందరమైన ద్వీప దేశం మాల్దీవులు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. 2007 సంవత్సరం తర్వాత పుట్టిన వారికి సిగరెట్ మరియు పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను పూర్తిగా నిషేధించింది. తద్వారా రాబోయే తరాలకు పొగ రహిత భవిష్యత్తును అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ చారిత్రక అడుగు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ నిబంధన ఎలా పనిచేస్తుంది? తెలుసుకుందాం..

మాల్దీవులు తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం. రాబోయే తరాలను పొగాకు వ్యసనం బారి నుండి పూర్తిగా రక్షించడం. పొగాకు వాడకం కారణంగా తలెత్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు మరియు అకాల మరణాలను నివారించడం ఈ ‘స్మోక్-ఫ్రీ నేషన్’ లక్ష్యం. ఈ విధానం యొక్క ప్రధాన సూత్రం చాలా సులభం. 2007 జనవరి 1 లేదా ఆ తర్వాత పుట్టిన ఏ వ్యక్తికైనా (వారు ఎంత పెద్దవారైనా సరే) పొగాకు ఉత్పత్తులను విక్రయించడం నిషేధం.

New Tobacco Law – No Cigarette Sales for Anyone Born After 2007
New Tobacco Law – No Cigarette Sales for Anyone Born After 2007

అంటే  17 సంవత్సరాల వయస్సు ఉన్న యువకుడికి ఈ నిషేధం వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ, ఈ నిబంధన వర్తించే ప్రజల వయస్సు పెరుగుతూ ఉంటుంది, తద్వారా క్రమంగా దేశంలో పొగాకు కొనుగోలు చేసే అవకాశం ఉన్న పౌరుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ విధానం విజయవంతమైతే సుమారు 20-30 సంవత్సరాలలో మాల్దీవులలో సిగరెట్ కొనుగోలు చేసే చట్టబద్ధమైన పౌరులు దాదాపుగా ఉండరు.

ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా మాల్దీవులు పొగాకు వినియోగాన్ని “నియంత్రించడం” కాకుండా “ముగించడం” లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో ఈ తరహా నిషేధాన్ని అమలు చేసిన మొదటి దేశాలలో మాల్దీవులు ఒకటిగా నిలిచింది. ఇది న్యూజిలాండ్‌తో సహా ఇతర దేశాలు అనుసరించడానికి ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇది కేవలం అమ్మకాలపై నిషేధం మాత్రమే కాదు పొగాకు పరిశ్రమ యొక్క భవిష్యత్తును దెబ్బతీసే ఒక వ్యూహాత్మక అడుగు.

ఈ చర్యతో, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, ఉత్పాదకతను పెంచడం మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారాన్ని తగ్గించడం వంటి అనేక సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను మాల్దీవులు ఆశిస్తోంది. పొగాకు రహిత ప్రపంచం కోసం ఈ ద్వీప దేశం చేసిన కృషి నిజంగా ప్రశంసనీయం.

 

Read more RELATED
Recommended to you

Latest news