మన జీవితంలో ‘అదృష్టం’ అనేది చాలాసార్లు అనుకోకుండా తలుపు తడుతుందని నమ్ముతుంటాం. కానీ చాణక్యుడు తన ‘నీతి శాస్త్రం’ ద్వారా అదృష్టం అనేది కేవలం యాదృచ్చికం కాదని అది కొన్ని మంచి లక్షణాలు, సరైన ప్రవర్తనల కలయికతో ఏర్పడుతుందని స్పష్టంగా చెప్పాడు. మరి అసలు అదృష్టం ఎవరిని వరిస్తుంది? చాణక్యుడు చెప్పిన ఆ అద్భుతమైన నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కష్టపడేవారికే విజయం వరిస్తుంది: చాణక్య నీతిలో అత్యంత ప్రాథమిక సూత్రం ఇది. అదృష్టం అనేది ఎప్పుడూ సోమరులను, పనులు వాయిదా వేసేవారిని వరించదు. నిజానికి ‘అదృష్టం’ అనేది కష్టపడి పనిచేసేవారికి దక్కే ప్రతిఫలం. ఎవరైతే తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి శారీరకంగా, మానసికంగా నిరంతరం శ్రమిస్తారో వారి చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా వారికి అనుకూలంగా మారతాయి. సరైన సమయంలో సరైన అవకాశాలు వారికి దొరుకుతాయి. అందుకే కష్టపడటమే అదృష్టానికి తొలి మెట్టు.
సత్యం, ధర్మం పాటించే వ్యక్తులు: చాణక్యుడు చెప్పినట్లుగా అదృష్టానికి మరొక ముఖ్యమైన పునాది సత్యం, ధర్మం. అంటే ఇతరులకు అన్యాయం చేయకుండా నీతిగా వ్యవహరించేవారికి సమాజంలో గౌరవం విశ్వాసం లభిస్తాయి. స్వల్పకాలంలో అబద్ధాలతో విజయం సాధించినా దీర్ఘకాలంలో నిజాయితీ మాత్రమే స్థిరమైన అదృష్టాన్ని అందిస్తుంది. ధర్మాన్ని పాటించే వ్యక్తి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది.

ఇతరుల పట్ల దయ, వినయం కలిగి ఉండేవారు: మనిషికి ఉండవలసిన అత్యుత్తమ గుణాలలో దయ వినయం ముఖ్యమైనవి. ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపే వ్యక్తులు మానవ సంబంధాలను బలోపేతం చేసుకుంటారు. విపత్కర పరిస్థితులలో కూడా వారికి సహాయం చేయడానికి పది మంది ముందుకు వస్తారు. ఈ సామాజిక మద్దతే గొప్ప అదృష్టంగా మారుతుంది.
సరైన నిర్ణయం తీసుకునే నేర్పు: అదృష్టం అంటే కేవలం మంచి జరగడం మాత్రమే కాదు, చెడు జరగకుండా చూసుకోవడం కూడా. చాణక్యుడు చెప్పినట్లుగా, అదృష్టవంతులు ఎప్పుడూ తొందరపడకుండా ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరు తమ శక్తిని సమయాన్ని అనవసరమైన వాటిపై వృథా చేయరు.
పొదుపు చేసే అలవాటు: చాణక్య నీతి ప్రకారం, ఆర్థిక క్రమశిక్షణే మనిషికి నిజమైన అదృష్టం. కష్టపడి సంపాదించిన ధనాన్ని వివేకంతో ఖర్చు చేసి, కొంత భాగాన్ని పొదుపు చేసే అలవాటు ఉన్నవారికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
చాణక్య నీతి ప్రకారం, అదృష్టం అనేది ఆకాశం నుండి ఊడిపడేది కాదు. అది మీ కృషి, మీ స్వభావం, మీ నిర్ణయాల యొక్క ఫలితం. ఈ ఐదు లక్షణాలను ఎవరైతే తమ జీవితంలో పాటిస్తారో, వారికి తప్పకుండా విజయం, శాంతి లభిస్తాయి. అదే నిజమైన, నిరంతర అదృష్టం.
