పీడకలలు ఎందుకు వస్తాయి? వాటికి రకాలు ఉన్నాయా? పరిష్కారం ఈ 5 టిప్స్!

-

గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, గుండె వేగంగా కొట్టుకుంటూ చెమటలు పట్టే అనుభవం మనలో చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది. భయంకరమైన దృశ్యాలు, ఎవరో తరుముతున్నట్లు లేదా ఎత్తు నుండి పడిపోతున్నట్లు వచ్చే ఈ పీడకలలు మనల్ని మానసికంగా కలవరపెడతాయి. అసలు ఈ పీడకలలు ఎందుకు వస్తాయి? ఇవి కేవలం భయాలేనా లేక మన అంతరాత్మ ఇస్తున్న సంకేతాలా? ఈ ఆసక్తికరమైన విషయాలను మరియు వాటి నుండి బయటపడే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా ఇలాంటి కలలు రావచ్చు. ఒత్తిడి భయం, అలసట, లేదా మనసులో దాచుకున్న ఆందోళనలు ఇవన్నీ కలిసి మన కలలపై ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా నిద్రకు ముందు ఫోన్, టీవీ, భయంకరమైన వార్తలు చూడటం వల్ల కూడా పీడకలలు పెరిగే అవకాశం ఉంటుంది. మన మెదడు విశ్రాంతి తీసుకునే సమయంలోనే, లోపల దాగున్న భావోద్వేగాలు కలల రూపంలో బయటకు వస్తాయి. అందుకే పీడకలలు అనేవి కేవలం కలలు కాదు మన మానసిక స్థితికి ఒక సూచనలాంటివి.

Why Do Nightmares Occur? Different Types and 5 Proven Solutions
Why Do Nightmares Occur? Different Types and 5 Proven Solutions

పీడకలలకు రకాలు కూడా ఉంటాయి. కొన్ని భయంకరమైన సంఘటనలపై ఆధారపడి వచ్చే కలలు వాటిలో ఉదాహరణకు ప్రమాదాలు ఎవరైనా వెంబడింపులు, పతనాలు. మరికొన్ని ఆందోళన కలిగించే కలలు వాటిలో పరీక్షలు, ఉద్యోగం కుటుంబ సమస్యలపై రావచ్చు. ఇక ఇంకొన్ని పునరావృత పీడకలలు అంటే ఒకే రకం కల మళ్లీ మళ్లీ రావడం. ఇవి ఎక్కువగా ట్రామా స్ట్రెస్ లేదా నిద్రలేమి వల్ల వస్తాయి. పీడకలలు తగ్గాలంటే కొన్ని సులభమైన టిప్స్ పాటించాలి.

ముఖ్యంగా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం కొన్ని సూచనలు తెలుసుకోవాలి.మొదటగా నిద్రకు ముందు ఫోన్, టీవీ దూరంగా పెట్టాలి. ఇక తరువాత ప్రశాంతమైన సంగీతం లేదా ధ్యానం చేయాలి. పడుకోబేయేముందు గోరువెచ్చని పాలు తాగడం లాంటి రిలాక్సింగ్ అలవాట్లు పాటించాలి. తరువాత నిద్రపోయే సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇక చివరిగా మనసులో ఉన్న బాధలను ఎవరో ఒకరితో పంచుకోవాలి. లేదంటే ఆ భాదలు కలల రూపం లో వస్తాయి.

పీడకలలు అనేవి మన శరీరం, మనసు నాకాస్త విశ్రాంతి కావాలి అని చెప్పే సంకేతాలే. వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే నిద్ర నాణ్యత తగ్గిపోతుంది రోజంతా అలసటగా అనిపిస్తుంది. కానీ సరైన నిద్ర అలవాట్లు, సానుకూల ఆలోచనలు ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే ఈ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు.

గమనిక: పీడకలలు తరచుగా వస్తూ, భయంతో నిద్ర పట్టకపోతే లేదా మానసిక ఒత్తిడి ఎక్కువైతే తప్పకుండా వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news