డ్రాగన్ ఫ్రూట్స్ తో లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్న ఇంజినీర్..!

-

ఈ మధ్య ఎక్కువ మంది ఉద్యోగాలను చేయడం లేదు. ఎక్కువగా వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. కొందరైతే ఉద్యోగాలను వదిలేసి వ్యవసాయం చేస్తున్నారు. మీరు కూడా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ బీటెక్ విద్యార్థి చేస్తున్న పనిని చూడాల్సిందే. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి డ్రాగన్ ఫ్రూట్స్ ని పండిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… యూపీ లోని షహజహన్‌ పూర్‌ జిల్లా లోని చిలహువా గ్రామానికి చెందిన అతుల్ మిశ్రా బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు.

 

చదువు అయిపోయిన తర్వాత తన సొంత ఊరిలో డ్రాగన్ ఫ్రూట్ ని పండించాలని అనుకున్నారు. 2018లో మహారాష్ట్ర లోని షోలాపూర్ నుండి ఈ ముక్కలను తీసుకు వచ్చి నాటించారు. అయితే బాగా ఫలితం ఉండడంతో ఐదెకరాల పొలం లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అతను పెంచడం మొదలు పెట్టారు. ఇంకా ఏడు ఎకరాల బంజరు భూమి ఉందని… అందులో కూడా డ్రాగన్ ఫ్రూట్స్ ని పండించాలనుకుంటున్నానని అతను చెప్పారు.

ప్రస్తుతం నలుగురికి ఉపాధి కల్పించి వీటిని పెంచుతున్నా.రు డ్రాగన్ ఫ్రూట్ తో చాలా లాభాలు వస్తున్నాయని అతను చెప్పారు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ని పెంచి తన వద్దకు వచ్చే రైతులకు అమ్ముతున్నారు అతుల్. మధ్యప్రదేశ్, బీహార్, యూపీ తో పాటు కొన్ని రాష్ట్రాల రైతులు కూడా వాటిని కొనుగోలు చేస్తున్నట్లు
అతుల్ చెబుతున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటిన ఏడాదికి పంట వస్తుంది ఇలా చక్కగా డ్రాగన్ ఫ్రూట్ ద్వారా లాభాలు వస్తున్నాయి కనుక మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని కానీ పంటలను కానీ మొదలుపెట్టాలంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్కల వైపు ధ్యాస పెట్టొచ్చు. చక్కటి లాభాలు వస్తున్నాయి కాబట్టి అతుల్ లానే మీరు కూడా అనుసరించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version