కోళ్లకు దానిమ్మతొక్కతో దాణా.. తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు

-

కోళ్ల పెంపకంలో.. దాణా చాలా ముఖ్యం. మంచి పోషకవిలువలు ఉన్న దాణా ఇస్తే.. కోళ్లు బలంగా ఉంటాయి. అయితే ఈ దాణాపై యజమానులు పెద్దగా ఖర్చుపెట్టరు. ఎక్కువ ఖరీదు ఉంటాయి అని.. ప్రత్యామ్యాయ మార్గాలు చూస్తారు. కానీ తక్కువ ఖర్చులో కూడా మంచి దాణాను కోళ్లకు ఇవ్వొచ్చు.. దానిమ్మ తొక్క వ్యర్ధాలతో కోళ్లకు దాణాను తయారు చేయొచ్చు.. జ్యూస్ దుకాణాలు, పండ్ల రసాల ప్రాసెసింగ్ యూనిట్లు వద్ద పెద్ద మొత్తంలో దానిమ్మ తొక్క వ్యర్ధాలు ఉంటాయి.
ఈ ప్రాసెసింగ్ వేస్ట్ ను సేకరించి ప్రత్యేక సాంకేతికత సహాయంతో కోళ్ల కోసం సప్లిమెంట్లను తయారు చేస్తారు. దానిమ్మ తొక్కలను నీడలో 4 రోజులు ఎండబెట్టి ముతక పొడిని తయారు చేస్తారు. ఇది దానిమ్మ తొక్క సారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే ముడి పదార్థంలా ఉపయోగపడుతుంది.. పొడిని వేడి నీటితో గాజు పాత్రలో పోస్తారు, ఆపై ముడి సారాన్ని రెండుసార్లు ఫిల్టర్ చేస్తారు. ఈ విధంగా తయారుచేసిన దానిమ్మ తొక్క సారం సూర్యరశ్మికి దూరంగా చీకటి ప్రదేశంలో భద్రపరచాలి. దీన్ని తయారు చేసిన 48 గంటలలోపు ఉపయోగించాలి.దానిమ్మ తొక్కలలో పాలీఫెనాల్స్ అనే రసాయనం ఉంటుంది, ఇది కోళ్లకు బాగా మేలు చేస్తుంది.
ఇంకా.. దానిమ్మ తొక్కల సారంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.. అంటే కోళ్లకు వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా, ఫంగస్‌ను తొలగించడానికి ఇది పనిచేస్తుంది. బ్రాయిలర్లు, లేయర్ బర్డ్స్‌కు రోజూ దానిమ్మ తొక్క సారం ఇస్తే వాటి పనితీరు మెరుగుపడుతుంది. 100 లీటర్ల దానిమ్మ తొక్క సారాన్ని తయారు చేసేందుకు రూ.110 మాత్రమే ఖర్చవుతుంది. ఈ పద్దతిని అనుసరించటం ద్వారా కోళ్ల పెంపకంలో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. కోళ్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. దగ్గర్లోని జ్యూస్ షాపుల వాళ్లను సంప్రదించి.. ఓ సారి చేసి చూడండి. వేసవిలో కోళ్ల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. లేదంటే… ఎండవేడికి కోళ్లు మృత్యువాతపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news