వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు రావు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఏపీలోకి ఎక్కడ అడిగినా… టీడీపీ రాదని ప్రజలు చెబుతున్నారని చురకలు అంటించారు. అసలు టీడీపీ పార్టీకి ఓటు వేసే పరిస్థితులు ఉన్నాయని బాంబ్ పేల్చారు.
బాబును నమ్మటమంటే చంద్రముఖిని నిద్ర లేపటమే అంటూ సెటైర్లు పేల్చారు జగన్. చంద్రబాబు మోసం చేస్తాడని ఏపీ ప్రజలకు చెప్పానని.. కానీ ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారన్నారు. దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ ను మించిపోయి చంద్రబాబు నటిస్తున్నాడని ఆగ్రహించారు జగన్. ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించిన జగన్… మాట్లాడుతూ… చీటింగ్ లో పీహెచ్డీ చేసిన బాబు..రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అంటాడన్నారు. భయం వేస్తుంది అని అంటాడని చురకలు అంటించారు. వెటకారంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. హామీలు అమలు చేయాలని అడిగితే.. సంపాదించే మార్గాలు ఉంటే చంద్రబాబు నా చెవిలో చెప్పాలని వెటకారం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల్లో next తెలుగు దేశం పార్టీ రాదు అని అంటున్నారు
– వైఎస్ జగన్ pic.twitter.com/eMYcn14c3E
— Rahul (@2024YCP) February 6, 2025