అరటిలో కొత్త పిలకల తయారి,నాటే పద్ధతులు..!!

-

అరటి లో కూడా వేరు కుళ్ళు,మొక్కలు ఎండిపోవడం వంటి వాటిని తరచూ చూస్తూనే ఉంటాము..వాటి స్థానంలో కొత్త పిలకను నాటడం చెయ్యాలి.పిలక మొక్కపై భాగం నరికి పాతినచో అవి త్వరగా నాటుకోని బాగా పెరుగును. పిలకలు నాటే ముందు 1% బావిష్టన్ ద్రావణంతో 5 నిముషాలు ఉంచిన తర్వాత నాటాలి.అరటి ముక్కు పురుగు అధికంగా గల ప్రాంతాలలో పిలకలు 0.5% మేటసిస్టాక్స్ ద్రావణంలో ముంచి నాటడం మంచింది.
తోట వేయవల్సిన నేలను బాగా దున్ని 10-15 రోజుల పాటు అలాగే ఉంచి తర్వాత నేలను చదును చేసి నిర్ణయించిన దూరంలో 45 సేం. మీ. లోతులో గొయ్యి తవ్వాలి. సాధారణంగా పొట్టి రకాలకు 1.5 మీ పొడవు రకాలకు 2 మీటర్ల దూరంలో గోతులు తీసి నాటాలి.

వర్షా కాలంలో అనగా జూన్ – జులై మాసలలో నాటుతారు. నీటి వసతి ని అనుసరించి అక్టోబర్ నుండి నవంబర్ నెలలో ఈ మొక్కలని నాటుకోవచ్చు.ముందు గుంటలలో పశువుల ఎరువు 5 కేజీలు 5 గ్రా. కార్బోఫ్యూరాన్ గుళికలు వేసి గుంత నింపవలెను.ఆ తరువాత పిలకలను గుంత మధ్యలో దుంప మరియు 2 అడుగుల పిలకలు భూమిలో కప్పబడి ఉండెటట్లు నాటవలెను.నాటిన తర్వాత పిలక చుట్టు మట్టిని కప్పవలెను.అరటి పిలకలు నాటిన 10-15 రోజులకు వేర్లు తోడుగును.ఆలా కాని యెడల 20 రోజుల తర్వాత పిలక స్థానంలో కొత్త పిలకలను నాటాలి.జంట వరుసలలో నాటేటప్పుడు వరుసల మధ్య దూరం తక్కువగా ఉండాలి.

రెండు జంటల వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉండాలి.ముందు వరుస మొక్కల మధ్యకు వచ్చే విధంగా నాటాలి.ఎరువులు సిఫార్సు చేసిన విధంగా ప్రతి మొక్కకు ఇవ్వాలి. అధిక సాంద్రాతలో నాటినప్పుడు పంట కాల పరిమితి 40-50 రోజులు పెరుగుతుంది. ఎక్కువ ఎత్తు పెరుగుతుంది.అందుకు తగిన జాగ్రత్తలు పాటించాలి.జంట వరుసల మధ్యన ఉన్న కాళీ భాగంలో 100-120 రోజుల కాల పరిమితి గల అంతర పంటల ఆకు కూరలు,కూరగాయలు వంటి తక్కువ కాలంలో వచ్చే వాటిని వేసుకోండి..డబుల్ ఆదాయం ను పొందవచ్చు…

Read more RELATED
Recommended to you

Latest news