రబ్బరు ఎలా సాగు చేస్తారో తెలుసా..? ఒక్కసారి మొక్క నాటితే.. 40 ఏళ్ల పాటు ఆదాయం..!

-

రబ్బరు సాగుతో కూడా లక్షల్లో ఆదాయం పొందవచ్చు. ఒక్కసారి మొక్క నాటితే.. 40 ఏళ్ల పాటు ఆదాయం ఆర్జింజవచ్చు. పైగా రబ్బర్ పంటకు పెట్టుబడి, శారీరక శ్రమ కూడా అవసరం లేదు. సులభ పద్ధతుల్లో రబ్బరు సాగు చేయడం ద్వారా ఏడాదికి లక్షల్లో ఆదాయం వస్తుందట. మీ దగ్గర ల్యాండ్‌ ఉంటే..ఇలాంటి వ్యాపారం చేయొచ్చు.. ఇంతకీ రబ్బరు ఎలా సాగుచేస్తారు..?

రబ్బరు మొక్క 5 సంవత్సరాలలో చెట్టుగా మారి ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. ఈ విధంగా దాదాపు 40 ఏళ్ల పాటు ఉత్పత్తిని ఇస్తుంది. అయితే రబ్బరు చెట్లు ఏపుగా పెరగాలంటే సూర్యరశ్మి చాలా అవసరం. ఈ మొక్కలకు రోజుకు 6 గంటల సూర్యకాంతి కావాలి. రబ్బరు రైతులకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు నుంచి లోను తీసుకునే వెసులుబాటు కూడా ఇచ్చింది. అడవిలో పెరిగే రబ్బరు చెట్లు సాధారణంగా 43 మీటర్ల పొడవు ఉంటాయి. వాణిజ్య ప్రయోజనాల కోసం పెంచిన చెట్లు కొంత చిన్నవిగా ఉంటాయి. రబ్బరు మొక్కల్లో 8000 జాతులు, 280 రకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో ఎన్ని రకాలు సాగులో ఉన్నాయో తెలియదు.

ఉష్ణ ప్రాంతాలు రబ్బరు సాగుకు అనువైన ప్రదేశాలు. రబ్బరు మొక్కల పెరుగుదలకు కనిష్ట ఉష్ణోగ్రత 25 °C , గరిష్ట ఉష్ణోగ్రత 34 °C అవసరం అవుతుంది. 4 నుంచి 6 pH ఉన్న నేల రబ్బరు సాగు అనుకూలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం రబ్బరు సాగులో నాల్గవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా మన దేశం ఉండటం గొప్ప విషయం. ముఖ్యంగా తమిళనాడు, కేరళ రబ్బరు ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలు. మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రబ్బరు సాగు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా మహిళలు రబ్బరు తయారీ రంగంలో పనిచేస్తున్నారుని గణాంకాలు చెబుతున్నాయి. ఆ రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఈ చెట్లను చూడండి భలే గమ్మత్తుగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version