వర్షాకాలంలో గొర్రెలకు వచ్చే పొట్ట జలగ వ్యాధి నివారణ చర్యలు..

-

వర్షాకాలంలో మనుషులకు మాత్రమే కాదు..జంతువులకు కూడా సీజనల్ వ్యాధులు రావడం సహజం..నీళ్లు పక్కన అంటే చెరువుల పక్కన తేమ గల ప్రాంతంలో , నత్తలు, నాచు ఉన్న ప్రాంతాలలో జీవాల్ని మేపడం, జీవాలు అందులో నీరు త్రాగడం ద్వారా జీవాలలో ఈ వ్యాధి సోకుతుంది.పొట్టను పట్టుకోని పోషక పదార్ధాలు పీల్చి వేస్తాయి. జలగలు లేదా జెనిగలు ఆకు రంగులో ఉంటాయి. నత్తల ద్వారా ఇవి వ్యాపిస్తాయి. చెరువులు, కాలువలు, కుంటలు తేమ, పచ్చిక బయళ్ళలో జీవాల్లో ప్రవేశించి జిర్ణాశయం నుంచి కాలేయాన్ని చేరతాయి.

ఈ వ్యాధికి కారణం పారాంఫిస్టోమము, కోటైలోఫోరాన్ తెగులకు చెందిన పొట్ట జలగల వలన వ్యాధి కలుగుతుంది. పొట్ట జలగలు కూజా ఆకారంలో ఎరుపు రంగులో ఉండి,15 మీ. మీ. వరకు పొడుగుంటాయి. పొట్టలోని గోడలకు ఆత్తుకొనిఉంటాయి. పిల్ల పొట్ట జలగలు 1నుండి 3 మీ. మీ. పొడుగుతో చిన్న ప్రేవుల మొదటి భాగమైన డుయోడినం గోడ లోపల పోరలో ఉంటాయి.

ఈ జలగల గుడ్లు పేడ ద్వారా బయటకు వస్తాయి.అవి నీటిలో చేరి పిల్లలుగా మారతాయి..కలుషితమైన గడ్డి, నీటి ద్వారా గొర్రె శరీరం లోనికి ప్రవేశించి, ముందుగా చిన్న ప్రేవుల లోపలి పొరలకు చేరుకొని, పోషక పదార్ధములను ఎక్కువగా పీల్చుకొని 3 నుండి 5 వారాలలో పెద్ద జలగలు గా అభివృద్ధి చెంది పొట్టలో రూమెన్ కు చేరుకుంటాయి.
ఈ వ్యాధి లక్షణాలు..గొర్రెలలో ఆకలి లేమి, నీరు ఎక్కువగా త్రాగడం , దుర్వాసనతో కూడిన నీళ్ల విరోచనాలు, దవడ కింద భాగంలో నీరు చేరడం , శరీరంలో నీరు చేరడం, అతి సారం , రక్తహీనత , మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని పర్యాయములు పిల్ల పొట్ట జలగలు అధిక సంఖ్యలో సోకడం వలన నీళ్ల విరోచనాలు కలిగి పడుకుంటాయి. అకస్మాత్తుగా చనిపోయే అవకాశం ఉంది..అంతేకాదు కంటి లోపల పోర తెల్లగా నిర్జీవంగా మారుతుంది..కొన్ని సందర్బాల్లో పిల్ల పొట్ట జలగలు పేడలో కనిపిస్తాయి…

వ్యాధి నివారణ:

వ్యాధి సోకిన వాటిని చెరువుల దగ్గరకు లేదా నీళ్ళు ఉన్న ప్రాంతాలలోకి పొనివ్వకూడదు..పరిశుభ్రమైన త్రాగు నీరు ఎల్లపుడు అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి.గడ్డి ఆకులపై ఏర్పడిన మంచునీటి బిందువులు జలగల సేర్కేరియా అనే లార్వా ఉండడానికి అవకాశం ఉంది. సూర్య రష్మీ పూర్తిగా వచ్చిన తర్వాతే మేతకు పంపాలి..అప్పుడే వేరే గొర్రెలకు వ్యాధి అయితే రాదు..

Read more RELATED
Recommended to you

Exit mobile version