స్ఫూర్తి: మొక్కలు నాటడం, కంపోస్ట్ గురించి ఫ్రీగా శిక్షణ ఇస్తున్న మహిళలు..!

-

నిజంగా కొంత మందిని చూస్తే మనం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఫీల్ అవుతూ ఉంటాము. ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా జీవితంలో ముందుకు వెళ్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఈ మహిళలు కూడా ఆదర్శంగా నిలిచారు. ఫ్రీగా వాట్సప్ గ్రూపుల ద్వారా గార్డెనింగ్ మరియు కంపోస్టింగ్ విషయాలపై బోధిస్తున్నారు. ఈ మహిళలు స్నేహితులకి కూడా ఈ విషయాలను చెప్తున్నారు.

భారతీ అశ్వత్, శుభ గోవిందాచారి, ప్రియా శ్రీనివాసన్ 24 వేల ప్రాంతాలలో ఉండే ప్రజలకి తోట పని మీద వీళ్ళు బోధించడం మొదలు పెట్టారట. వీళ్ళు ముగ్గురు కలిసి ఆఫ్లైన్లో ఎన్నో వర్క్ షాప్లను కూడా నిర్వహించారు. అయితే ఆఫ్లైన్లో వర్క్ షాప్ లకి అందరూ రాలేకపోతున్నారని వాట్సాప్ గ్రూపుల ద్వారా బోధించడం మొదలుపెట్టారు. కంపోస్ట్ గురించి తోట పనుల గురించి వీళ్ళు చాలా మందికి బోధించారు నిజానికి ఇలాంటి విషయాలని బోధించడం కష్టం.

అందులోనూ ఆన్లైన్లో బోధించడం కష్టం. అది కూడా ఫ్రీగా నేర్పడం. ఇతరులకి నెరపడం కోసం చిన్న చిన్న భాగాల కింద విభజించుకుని నేర్పించడం సులభం అయిందని ఈ మహిళలు చెప్తున్నారు. ప్రతి నెల కూడా 8 వ తారీఖున ఒక లింక్ ఇస్తామని ఆ లింకు ద్వారా అందరూ జాయిన్ అవ్వచ్చు అని క్లాసులు వినచ్చని వీళ్ళు చెప్తున్నారు. ఈ సెషన్ 5 రోజులు పాటు జరుగుతుందట.

వీడియోలు, ప్రజెంటేషన్లు, పీడిఎఫ్లు ఇలా వీటి అన్నింటితో వీళ్ళు నేర్పిస్తున్నారు కేవలం ముంబైలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్లో కూడా నేర్పిస్తున్నారు. అలానే యూఏఈ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యుఎస్, సింగపూర్, మలేషియాలో కూడా ఈ మహిళలు నేర్పిస్తున్నారు. పాటింగ్ మిక్స్ ని ఎలా తయారు చేయాలి ఎలా మొక్కలని రక్షించాలి వంటి ఎన్నో విషయాలని నేర్పిస్తూ ఉంటారు ఈ మహిళలు. ఇలా ఇతరులకి సహాయపడడం అనేది ఎంతో స్ఫూర్తిదాయకం.

Read more RELATED
Recommended to you

Exit mobile version