చలికాలంలో పెదవులు బాగా పగిలిపోతున్నాయా..? అయితే ఇది చూడాల్సిందే..!

చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. దీనితో పెదవులు పగిలిపోవడం సహజం. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా..? శీతాకాలంలో పెదవులు పొడిబారిపోతే మంట కూడా వస్తుంది. ఒక్కొక్క సారి బాగా పగిలిపోవడం వలన బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది అయితే శీతాకాలంలో మీ పెదవులు పగిలిపోకుండా ఉండాలంటే వీటిని కచ్చితంగా చూడాల్సిందే. అప్పుడు మీ పెదవులకి ఎటువంటి సమస్య ఉండదు సరి కదా అందంగా ఉంటాయి.

విటమిన్ ఈ క్యాప్సిల్:

మీరు పెదవులకి విటమిన్ ఈ క్యాప్సూల్ ని అప్లై చేయడం వలన మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది దీనితో పెదవులు పగిలిపోకుండా ఉంటాయి.

తేనె అప్లై చేయండి:

పెదవులకి తేనే అప్లై చేయడం వలన పగుళ్లు తొలగిపోతాయి తేమగా ఉంటాయి కూడా.

కొత్తిమీర:

కొత్తిమీరని కూడా మీరు పెదవులకి అప్లై చేయొచ్చు కొత్తిమీరని పేస్ట్ కింద చేసే పెదవులకి రాస్తే పెదవులు బాగుంటాయి.

గులాబీ రేకులు:

పాలల్లో గులాబీ రేకులని నానబెట్టి దానిని పెదవులకు అప్లై చేస్తే పెదవులు ఎర్రగా ఉంటాయి.

అలోవెరా జెల్:

మీరు పెదవులకి అలోవెరా జెల్ ని కూడా రాయచ్చు ఇది కూడా మీ పెదవుల్ని బాగా ఉంచుతుంది. మృత కణాలని తొలగిస్తుంది.

కీరాదోస:

కిరా దోస ని ముక్కల కింద కట్ చేసుకుని మీరు పెదవులు కి అప్లై చేస్తే పెదవులు బాగుంటాయి సమస్య కూడా ఉండదు.
సన్ ఫ్లవర్ ఆయిల్:

కొద్దిగా సన్ ఫ్లవర్ ఆయిల్ ని మీ పెదవులకి రాస్తే కూడా పెదవులు బాగుంటాయి ఇబ్బంది ఉండదు. ఇలా పెదవులు పగిలిపోకుండా ఉండాలంటే ఈ విధంగా అనుసరించండి అప్పుడు కచ్చితంగా మీ పెదవులు బాగుంటాయి ఏ ఇబ్బంది ఉండదు.