జిడ్డు, పొడి చర్మానికి రక్షణనిచ్చే ఆయుర్వేద మూలికలు.. మీ ఇంట్లోనే.

-

ముఖం మీద మచ్చలు లేకుండా, మొటిమలు కాకుండా, చూడడానికి అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. దాని కోసమే మార్కెట్లో దొరికే చర్మ సంరక్షణ సాధనాలని వాడుతుంటారు. బయట దొరికే రసాయనాలు చర్మానికి మేలు చేయకపోగా హాని కలగజేస్తాయి. అంటే అన్నీ హాని చేస్తాయనే కాదు. మనకేదీ సరైనదో తెలుసుకోకుండా మార్కెట్లో డిమాండ్ ఉంది కదా అని చెప్పి ప్రతీ దాన్ని మీ చర్మంపై ప్రయోగించకూడదు. అందుకే చర్మానికి ఆయుర్వేద మూలికలతో చేసిన సాధనాలని వాడితే బాగుంటుంది.

మూలికలతో చేయాల్సిన చర్మ సాధనాలని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

మల్లెచెట్టు ఆకులు

సువాసనని వెదజల్లే మల్లెపువ్వులు, వాటి ఆకులు చర్మానికి ఎంతో మేళు చేస్తాయి. ఈ చెట్టు ఆకుల్లో సూక్ష్మజీవులని నాశనం చేసే మూలకం ఉంటుంది. దీనివల్ల చర్మం మీద ఎలాంటి సూక్షజీవుల వల్ల ఇబ్బంది కలగదు. దీనికోస మల్లె చెట్టు ఆకులని తీసుకుని రోజ్ వాటర్ లో కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేసుకుంటే మంచిది. జిడ్డూ చర్మం ఉన్నవారికి మల్లెచెట్టు ఆకులు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

చందనం

చందనం శరీరాన్ని చల్లదనంగా ఉంచడంతో పాటు ఆరోగ్యంగా చేస్తుంది ఇందులో ఉండే పోషకాల వల్ల పొడిగా ఉన్న చర్మం తేమగా మారుతుంది. కొంచెం చందనం తీసుకుని రోజ్ వాటర్ లో కలుపుకుని పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.

వేప ఆకులు

వేప ఆకులని తీసుకుని రోజ్ వాటర్ తో కలుపుకుని ముఖానికి మర్దన చేసుకోవాలి. అపుడు మచ్చలు, మొటిమలు వంటివి తగ్గుతాయి. చనిపోయిన చర్మ కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. మూసుకుపోయిన చర్మ రంధ్రాలని తెరుచుకునేలా చేసి ఆరోగ్య్ంగ ఉంచుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version