మీ ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నాయా..? అయితే ఇది మీకోసమే…!

-

ముఖం మీద వచ్చే మొటిమలని తొలగించడం నిజంగా పెద్ద సమస్య. ప్రతి ఒక్కరూ మొటిమలు లేని చర్మాన్ని కోరుకుంటారు. వీటిని పోగొట్టాలంటే ఏం చెయ్యాలి..? ఏం కంగారు పడకండి. ఈ టిప్స్ ని కనుక మీరు ఫాలో అయ్యి ఇక్కడ చెప్పిన వాటిని జాగ్రత్తగా గ్రహిస్తే చాలు. మీ ముఖం పై మొటిమలు పోయి నిగనిగలాడుతుంది మీ ముఖం. మరి ఇక ఆలస్యం ఎందుకు ఇప్పుడే పూర్తిగా చూసేసి ఫాలో అయిపోండి.

చాక్లెట్, బర్గర్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మరియు కొన్ని ఫుడ్స్ తినడం వల్ల మొటిమలు వస్తాయని మనమందరం విన్నాం. అయితే ఈ విషయంపై క్లుప్తంగా చూస్తే … రొట్టె ఉత్పత్తులు వైట్ బ్రెడ్, బాగెల్స్, రోల్స్ వంటివి తీసుకుంటే బ్రెడ్‌లో చక్కెర మరియు గ్లూటెన్ ఉన్నాయి. అలానే ఇది ఇన్సులిన్ స్థాయిని పెంచుతాయని కనుగొనబడింది. బ్రెడ్ కొత్త చర్మ కణాలు పెరగడానికి కారణమవుతుంది, అలాగే మీ శరీరంలో ఎక్కువ నూనె ఉత్పత్తి అవుతుంది. ఇలా పింపుల్స్ కి దారి తీస్తాయి.

అలానే పాస్తా మరియు నూడుల్స్ కూడా మొటిమలకు దారి తీస్తాయి. వీటిలో గ్లూటెన్ అధికంగా ఉంటుంది. ఇవి కూడా మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా మొటిమలకి దారి తీస్తాయి. కాబట్టి మొటిమలు ఎక్కువగా ఉన్నట్టు అయితే వీటిని తీసుకోకండి. అలానే ఫాస్ట్ ఫుడ్ వినియోగాన్ని పరిమితం చేయమని నిపుణులు మనకు తెలియజేసినప్పటికీ, ఎవరు ఈ సంగతిని పట్టించుకోవడం లేదు. మొటిమలు ఎక్కువగా కేలరీలు, కొవ్వు మరియు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ల తో కూడిన పాశ్చాత్య తరహా ఆహారాన్ని తినడంతో సంబంధం కలిగి ఉన్నాయని కనుగొన్నారు. కనుక ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకున్నా కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు వీటిని తినడం కూడా తగ్గిస్తే మేలు.

Read more RELATED
Recommended to you

Latest news