వేసవికాలంలో కూడా ముఖం ఆరోగ్యంగా కనిపించాలంటే ఇలా చేయండి..!

-

వేసవికాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఎండ ఎక్కువగా ఉంటుందో చర్మం పై జిడ్డు పేరుకుపోవడం సహజం. అయితే అటువంటి సమయంలో ముఖం పై మొటిమలు రావడం వంటివి ఎదురవుతాయి. కనుక ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్మ ఆరోగ్యం బాగుండాలంటే వీటిని తప్పకుండా పాటించాలి. ప్రతిరోజు తప్పకుండా ముఖాన్ని తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన చర్మం పై ఉండే సీబం తొలగిపోతుంది. కాకపోతే ఎక్కువసార్లు కడగడం వలన మొటిమలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.

కనుక ముఖాన్ని సరైన విధంగా శుభ్రం చేసుకోవాలి. కెమికల్స్ ఉపయోగించని ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు సార్లు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. రోజంతా ఎక్కువగా చెమటలు పట్టినట్లయితే ముఖాన్ని కేవలం నీటితో శుభ్రం చేసి చర్మాన్ని ఎక్కువగా రుద్దకుండా తుడుచుకోవాలి. చర్మం పై మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే సాల్సిలిక్ యాసిడ్, ట్రీ ఆయిల్ ఉండేటువంటి ఫేస్ వాష్ ను ఎంపిక చేసుకోవచ్చు. సహజంగా వేసవికాలంలో చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయని చాలా శాతం మంది మాయిశ్చరైసర్ ను రాయకుండా వదిలేస్తారు. కాకపోతే చెమటలు ఎక్కువగా ఉన్నా చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి లేకపోతే చర్మం నూనె ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో మాయిశ్చరైసర్ రాయకపోతే చర్మం మరింతగా జిడ్డుగా మారుతుంది.

ఎప్పుడైతే మాయిశ్చరైజర్ ను ఉపయోగిస్తారో చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయం చేస్తుంది. వేసవికాలంలో మాత్రమే కాకుండా ప్రతి సీజన్ లో సన్ స్క్రీన్ ను ఉపయోగించడం ఎంతో అవసరం. అయితే ఎంతో హానికరమైన యువి కిరణాల నుండి కాపాడుకోవడానికి తప్పకుండా ఎస్పీఎఫ్ 30 లేక అంతకంటే ఎక్కువ ఉండేటువంటి సన్ స్క్రీన్ ను ఉపయోగించాలి. ముఖ్యంగా వేసవి కాలంలో నూనె లేని జెల్ ఆధారిత లేక మ్యాట్ ఫినిషింగ్ ఉండేటువంటి సన్ స్క్రీన్ ను ఉపయోగించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. కనుక ఇటువంటి జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేస్తే వేసవిలో మొటిమలు రాకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version