సన్నబియ్యం పంపిణీకి హెలికాప్టర్‌లో వెళ్లిన మంత్రి.. ఎక్కడంటే?

-

తెలంగాణ ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా నేడు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారికంగా రిబ్బన్స్ కట్ చేసి కొబ్బరి కాయలు కొట్టి మరీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సన్నబియ్యం పంపిణీ చేసేందుకు హైదరాబాద్ నుంచి సొంత జిల్లాకు వెళ్లారు. అయితే, సన్న బియ్యం ఇవ్వడానికి హెలికాప్టర్‌లో మంత్రి వెళ్లడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నల్గొండ,యాదాద్రి భువనగిరి జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి హెలికాప్టర్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్తువెత్తున్నాయి. నిన్న మంత్రి ఉత్తమ్ సైతం ఉగాది నాడు పలుమార్లు హెలికాప్టర్ జర్నీలు చేయడంపై విమర్శలు వచ్చాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version