అందమైన చర్మానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో అవసరం. చర్మంపై ముడుతలు రావడం, నిజమైన వయస్సు కన్నా ఎక్కువ ఏజ్ లో కనిపించడం, వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మ పొడిబారిపోవడం మొదలగు సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమస్యలకి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా మంచిది.
ఐతే ఏయే ఆహారాలు చర్మానికి మేలు చేస్తాయో తెలుసుకుందాం..
అరటి పండు..
చర్మం జిడ్డుగా ఉంటే అరటి పండు, తేనే, నిమ్మరసం కలిపి మర్దన చేసుకోవాలి. దీనివల్ల చర్మంపై జిడ్డూ తొలగిపోతుంది. ఒకవేళ పొడిబారిన చర్మం అయితే అరటి పండు, తేనే, కొబ్బరి నూనె మిశ్రమాన్ని మర్దన చేసుకోవాలి. మొటిమలు పోవడానికి బనానా ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది.
శనగ పిండి..
చర్మం తేమగా మారడానికి శనగపిండిలో పసుపు, పాలు మిక్స్ చేసి మర్దన చేసుకుంటే బాగుంటుంది.
ఎగ్ వైట్..
కొంచెం ఎగ్ వైట్ తీసుకుని దానికి పెరుగు కలుపుకుని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మం ఏర్పడిన చిన్న చిన్న గుంతలు పూడుకుపోయి అందంగా తయారవుతుంది.
పెరుగు..
చర్మం పొడిగా ఉన్నా, సూర్యుని ఎండ తాకిడికి గురై కాంతి తగ్గిపోయినా, చర్మంపై దురద పుడుతూ చికాకు పెడుతున్నా, పెరుగుతో చేసే మిశ్రమం బాగా పనిచేస్తుంది. కొంచెం పెరుగు తీసుకుని దానిలో తేనె కలుపుకుని ఆ మిశ్రమానికి పాలు యాడ్ చేస్తే కొత్త మిశ్రమ తయారవుతుంది. దాన్ని చర్మంపై సరిగ్గా మర్దన చేసుకుంటే పొడి బారడం తగ్గి తేమగా అందంగా తయారవుతుంది. ఇంకా చికాకు పెట్టే దురద మాయమవుతుంది. చర్మంపై కొంత కాంతి వచ్చి చేకూరుతుంది.
సో.. ఇదండీ చర్మం ఆరోగ్యంగా అందంగా కనబడాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని వాడుకోవాలి.