జుట్టు కోసం స్ట్రెయిట్నర్ ఉపయోగిస్తున్నారా? వాటి దుష్ప్రభావాలు తెలుసుకోండి.

-

ఈ కాలంలో ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా తమ శిరోజాల అందాన్ని మరింత పెంచి ఇంకా అందంగా కనబడేందుకు స్ట్రెయిటెనింగ్ ప్రక్రియకు వెళ్తున్నారు. దీనివల్ల జుట్టు నిటారుగా ఇష్టం వచ్చినట్టుగా దువ్వుకోవడానికి వీలుంటుంది. చిన్న చిన్న ఫంక్షన్ల నుండి మొదలుకుని పెళ్ళిళ్ళ వరకు ప్రతీ పార్టీలో అందంగా కనబడాలని ఈ ప్రక్రియను వాడుతున్నారు. ఐతే మీకీవిషయం తెలుసా? స్ట్రెయిటెనింగ్ ప్రక్రియ జుట్టుపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బ తీయడానికి కారణంగా మారుతుంది. స్ట్రెయిటెనింగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

తరచుగా స్ట్రెయిటెనింగ్ కి వెళ్తున్నట్లయితే అది జుట్టుని ప్రాణం లేనిదిగా మారుస్తుంది. అధిక వేడి మీ జుట్టు మీద తరచుగా పడడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తగ్గిపోతాయి. జుట్టు ఆరోగ్యంలో ఎంతో కీలకమైన ఈ నూనెలు, కుదుళ్ళ నుండి పోయినపుడు వెంట్రుకలు రాలిపోవడం ప్రారంభమవుతుంది. వెంట్రుకల చివర్లు విరిగిపోవడానికి ఇదొక ముఖ్య కారణం.

చుండ్రు, దురద మొదలగునవి ఏర్పడడానికి తరచుగా స్ట్రెయిటెనింగ్ చేయడం ఓ కారణంగా ఉంటుంది. అదీగా స్ట్రెయిటెనింగ్ వల్ల జుట్టు నిటారుగా నిలబడుతుంది. దీనివల్ల కుదుళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. దానివల్ల జుట్టు పెరుగుదలలో లోపం కనిపిస్తుంది. ఇంకా జుట్టులోని స్టెనోసిస్ కారణంగా అవి చెల్లాచెదురుగా తయారవుతాయి.

స్ట్రెయిటెనింగ్ చేసుకునేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తరచుగా కాకుండా వారానికి కేవలం ఒక్కసారి మాత్రమే స్ట్రెయిటెనింగ్ కి వెళ్ళండి. అంతకు మించి స్ట్రెయిటెనింగ్ వాడకపోవడమే మంచిది. తడిజుట్టుతో ఉన్నప్పుడు స్ట్రెయిటెనర్ వాడవద్దు. ఇది జుట్టు మీద చాలా చెడు ప్రభావాన్ని సూచిస్తుంది. కొబ్బరినూనె, పాలు, అఅలివ్ ఆయిల్ కలిపి జుట్టుకి వర్తించండి.

Read more RELATED
Recommended to you

Latest news