రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఫ్యాన్ వార్.. దారుణంగా ట్రోలింగ్‌

-

సినిమా ఇండ‌స్ట్రీలో ఫ్యాన్స్ వార్ అనేది కామ‌న్‌. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులు వార్‌కు దిగ‌డం ఇంత‌కు ముందు కూడా చూశాం. అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ విష‌యంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఇప్పుడు వార్‌కు దారి తీశారు. సోష‌ల్ మీడియాలో ఈ ఇద్ద‌రినీ విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు.

నిన్న ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎన్టీఆర్ లుక్ విడుద‌లైంది. అయితే ఈ లుక్‌పై నెగెటివ్ కామెంట్స్ వ‌చ్చాయి. ఇంత పేల‌వంగా పోస్ట‌ర్ ఉంటుందా అంటూ సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ర‌చ్చ చేశారు. రామ్ చ‌ర‌ణ్ పోస్ట‌ర్ అంత హైలెట్ అయింద‌ని, ఎన్టీఆర్ పోస్ట‌ర్ ఇలా ఉంటుందా అంటూ కామెంట్లు చేశారు.

దీంతో అటు రామ్ చ‌రణ్ అభిమానులు కూడా వార్‌కు దిగారు. వీరిద్ద‌రూ ఒక‌రి హీరోపై మ‌రొక‌రు దారుణంగా ట్రోల్ మొద‌లెట్టారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా FanBaseLessRamCharan, FanBaseLessNTR అనే హ్యాష్ ట్యాగ్‌లతో ర‌చ్చ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ రెండు హ్యాష్‌టాగ్‌లు నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. మ‌రి పోస్ట‌ర్ల విష‌యంలోనే ఇంత జ‌రిగితే రేపు సినిమాలో ఎన్టీఆర్‌కు ఏ మాత్రం త‌క్కువ చేసినా థియేట‌ర్ల వ‌ద్ద పెద్ద గొడ‌వ‌లే జ‌రిగే ప్ర‌మాదం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news