అందమైన కురులు పొందడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి వాళ్ళు ఈ చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల మీ కురులు అందంగా, పొడుగ్గా ఉంటాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.. ఆముదం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ మనం పొందవచ్చు. ఆముదం లో(Castor oil) పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
ఇది జుట్టును బలంగా ఉంచుతుంది. అలానే ఆముదం లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇది డామేజ్ అయిపోయిన జుట్టును కూడా తిరిగి బాగు చేస్తుంది. దురద, చుండ్రు వంటి సమస్యలను కూడా ఇట్టే తరిమికొట్టేస్తుంది ఆముదం.
జుట్టుకి ఆముదం ఎందుకు..?
జుట్టుకి ఆముదం రాయడం వల్ల జుట్టు త్వరగా ఎదుగుతుంది. ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి సహాయపడుతుంది. దీనితో జుట్టు త్వరగా ఎదుగుతుంది. అలాగే జుట్టు పొడిబారి పోకుండా ఇది కాపాడుతుంది.
ఆముదం వల్ల కలిగే ప్రయోజనాలు..?
రెగ్యులర్ గా ఆముదంతో మసాజ్ చేయడం వల్ల జుట్టు త్వరగా ఎదుగుతుంది మరియు బలంగా ఉంటుంది. రెగ్యులర్ గా కొన్ని చుక్కలు ఆముదాన్ని కొబ్బరి నూనెలో కానీ ఆలివ్ ఆయిల్ లో వేసి మసాజ్ చేయడం వల్ల జుట్టు ఎదుగుతుంది.
జుట్టు సాఫ్ట్ గా అవ్వాలంటే ఆముదంలో కొద్దిగా కలబంద గుజ్జు, నిమ్మరసం, తేనె వేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు సాఫ్ట్ గా అవుతుంది. ఆముదంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మరియు యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి.
ఇది జుట్టుని దృఢంగా మారుస్తుంది. జుట్టు షైనింగ్ గా ఉండడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రెగ్యులర్ గా ఆముదాన్ని జుట్టుకి అప్లై చేసి ఈ సమస్యల నుండి బయటపడండి.