ఇంట్లో బొద్దింకలు ఇంటే ఎంత చిరాకుగా ఉంటుందో కదా..! ముఖ్యంగా ఈ బొద్దింకలు అన్నీ వంటగదిలో ఎక్కువగా ఉంటాయి. వంటగదిలో బొద్దింకలు ఉంటే అసలు ఏదీ వండబుద్ది కాదు.. తినే వాటిమీద కూడా మనకు మనసు ఉండదు. మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా బొద్దింకలు వస్తూనే ఉంటాయి. బొద్దింకలను తరిమికొట్టడానికి చాలా మంది వాణిజ్యపరంగా లభించే రసాయన స్ప్రేలను ఉపయోగిస్తారు. కానీ వాటి వల్ల ప్రయోజనం లేదు. అంతే కాకుండా పిల్లలు ఉన్న ఇంట్లో కెమికల్స్ వాడేటపుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే అవి చాలా ప్రమాదకరమైనవి. కానీ, బొద్దింకలను సులభంగా వదిలించుకోవడానికి సూర్యరశ్మి సబ్బు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది.
బొద్దింకలను తరిమికొట్టడానికి ఈ సబ్బును ఉపయోగించవచ్చు. ఈ సన్‌లైట్ సోప్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి, ఒక గ్లాసు నీటిలో వేసి బాగా కరిగించి, ఆపై నీటిని స్ప్రే బాటిల్‌లో పోసి బొద్దింకలపై స్ప్రే చేయండి. ఈ సబ్బులోని రసాయనాలు బొద్దింకలను చంపుతాయి.
అదేవిధంగా బొద్దింకలను తరిమికొట్టేందుకు బోరిక్ యాసిడ్ కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం బోరిక్ యాసిడ్‌ను నీటిలో కరిగించి, ఆ నీటిని ఇంటి మూలల్లో చల్లితే బొద్దింకలు రాకుండా ఉంటాయి. బొద్దింకలు బోరిక్ యాసిడ్ వాసనను ఇష్టపడవు.
బొద్దింకలను వదిలించుకోవడానికి మరొక మార్గం ఏమిటంటే, పిప్పరమింట్ ఆయిల్ మరియు ఉప్పును నీటిలో కరిగించి ఇంట్లో బొద్దింకలు ఉన్న చోట చల్లుకోండి.
వంట సోడా వాడడం వల్ల కూడా బొద్దింకలని దూరం చేయొచ్చు. బేకింగ్ సోడాలో అరటీ స్పూన్ చక్కెర కలిపి నీరు కలపండి. దీనిని ఇంటి మూలల్లో స్ప్రే చేయండి. దీని వల్ల బొద్దింకలు దూరమవుతాయి.
కర్పూరం , స్ప్రే సీసా, నిమ్మకాయ , వెనిగర్, పత్తి తీసుకోవాలి. కర్పూరం పొడిని కాగితంపై వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని స్ప్రే బాటిల్‌లో వేసి అందులో వెనిగర్, నిమ్మరసం, అరకప్పు నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా షేక్ చేసి వంటగదిలో బొద్దింకలు సంచరించే ప్రదేశాలలో స్ప్రే చేయాలి.
ఈ చిట్కాలను పాటించడం వల్ల ఇంట్లో బొద్దింకలు తొలగిపోతాయి. బొద్దింకలు రావొద్దు అంటే ముందు నుంచే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారంలో మూతలు వేయాలి. పాడేపోయిన ఆహారాన్ని బయటపారేయాలి.