కుంకుళ్లతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే వదలరు..!

-

కుంకుడు కాయలు..ఈ తరానికి పెద్దగా తెలియదు కానీ.. ఇప్పుడు 40 ఏళ్లు దాటిన వారికి వీటితో చాలా అనుభవాలు ఉంటాయి. చిన్నప్పుడు షాంపూలుగా కుంకుడు రసమే వాడేవారు. కుంకుళ్లలో సహజంగా ఉండే సాపోనిన్ అనే సహజ రసాయనం మంచి క్లెన్సర్ మాత్రమే కాదు, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాల్ని కలిగి ఉంటుంది.

అందుకే కుంకుడు ఒంటినీ ఇంటినీ శుభ్రపరుస్తుంది. చుండ్రునీ నిర్మూలిస్తుంది. కుంకుడు తలకే వాడతారని చాలా మంది అనుకుంటారు. కానీ ఊలు, సిల్కు వంటివి కుంకుడురసంతో ఉతికితే పాడవకుండా చక్కని మెరుపుని సంతరించుకుంటాయి. పూర్వం నుంచి పట్టుచీరల్ని కుంకుడురసంతో ఉతకడం మనదగ్గర వాడుకలో ఉంది. టస్సర్ సిల్కుకి అద్దే రంగుల్లోనూ కుంకుడు రసం కలుపుతుంటారు.

 

 

ఇక కుంకుడు కాయల్లో విటమిన్-ఎ, డి, కె సహజంగానే ఉంటాయి. దాంతో జుట్టయినా సిల్కయినా అందంగా మెరుస్తుంది. జుట్టు ఊడిపోవడాన్ని అరికడుతుంది. పైగా వీటిల్లో సహజంగానే ఉండే తేమ కారణంగా మంచి కండిషనర్‌గానూ పనిచేస్తుంది. కుంకుడు రసం మంచి డాగ్ షాంపూ కూడా.

వీటిని ఎలా వాడాలంటే.. కుంకుడుకాయల్ని నానబెట్టి ముద్దలా చేసి అందులో టేబుల్‌స్సూను ఆలివ్ నూనె వేసి షేవింగ్ క్రీమ్ గానూ వాడుకోవచ్చు. కుంకుళ్ల రసాన్ని మొక్కలమీద చల్లితే ఆ వాసనకి క్రిమికీటకాలు నశిస్తాయి. పండు కూరగాయల్ని కుంకుడు రసం కలిపిన నీటిలో నానబెడితే వాటికి ఉన్న రసాయనాల అవశేషాలన్నీ పోతాయి.

బంగారు, వెండి నగల్ని శుభ్రం చేయడానికి కుంకుడు రసాన్ని మించిన లోషన్ లేదు. కుంకుడుకాయ అద్భుతమైన దోమల మందు అనీ, ఇది దోమ లార్వానీ ప్యూపానీ సమూలంగా నాశనం చేస్తుందనీ మద్రాస్ యూనివర్సిటీ పరిశోధనలోనూ స్పష్టమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version