చలికాలం: జుట్టు రాలే సమస్యకు గుడ్డుతో చెక్ పెట్టేయండిలా..

-

చలికాలంలో సాధారణంగా జుట్టు పొడిబారటం, వెంట్రుకల చివర్లు విరిగిపోవడం, జుట్టు రాలిపోవడం సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుండి దూరం అవ్వడానికి గుడ్డు బాగా పనిచేస్తుంది. ప్రస్తుతం గుడ్డు వల్ల జుట్టుకు కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు విటమిన్లు A,D,E ఇంకా బి12 ఉంటాయి. ఈ పోషకాల కారణంగా జుట్టుకు మంచి సంరక్షణ అందుతుంది.

పొడిబారటాన్ని తగ్గించే ఎగ్ మాస్క్:

జుట్టు పొడిబారినట్టు, ఎండిపోయినట్టు కనిపిస్తే ఎగ్ మాస్క్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పగలగొట్టిన గుడ్డుసొన తీసుకొని జుట్టుకు కుదుళ్ల నుంచి బాగా మర్దన చేయాలి.
30నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో జుట్టు కడుక్కుంటే సరిపోతుంది. దీనివల్ల జుట్టులోని తేమ ఎండిపోకుండా ఉంటుంది.

చుండ్రు సమస్యను తగ్గించే గుడ్డు, తేనె మాస్క్:

జుట్టులో చుండ్రు కారణంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యకు గుడ్డు, తేనె మాస్క్ పరిష్కారం చూపుతుంది.
దీనికోసం ఒక గుడ్డును పగలగొట్టి.. దాని రసంలో ఒక చెంచాడు తేనె కలిపి జుట్టుకు మాస్క్ వేయాలి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాల వల్ల చుండ్రు సమస్య దూరమవుతుంది.

జిడ్డును తగ్గించే తెల్లసొన:

మీ జుట్టు నుంచి నూనె ఎక్కువగా కారుతున్నట్లయితే తెల్లసొన బాగా ఉపయోగపడుతుంది. జిడ్డు తనాన్ని పోగొట్టేందుకు గుడ్డును పగలగొట్టి అందులోంచి పచ్చసొన తీసివేసి కేవలం తెల్ల సున్నతో మాత్రమే జుట్టుకు మాస్క్ వేయాలి. దీనివల్ల వెంట్రుకల్లోని జిడ్డు తగ్గుతుంది.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version