భాజాపా బాబు జ‌నాల పార్టీ… పంచ్ అదిరిందిగా…

-

భాజాపా అంటే మీకు తెలుసా.. ఆ తెలియ‌క‌పోవడం ఏమిటి.. ఇదేమ‌న్నా ఓ పెద్ద ప్ర‌శ్నా.. భాజాపా అంటే అంద‌రికి తెలిసిందే క‌దా.. అదేనండీ.. భార‌తీయ జ‌న‌తా పార్టీ దీనిని షార్ట్‌క‌ట్‌లో బీజేపీ అని కూడా అంటారు.. ఇంత‌మాత్రం ఎవ్వ‌రికి తెలియ‌దు.. కానీ ఇక్క‌డ భాజపా అంటే ఇప్పుడు కొత్త నిర్వ‌చనం చెపుతున్నారు ఈ సీనియ‌ర్ నేత‌. భాజపా అంటే అట్లాంటి ఇట్లాంటి నిర్వ‌చ‌నం కాదు.. ఏకంగా భాజపా నేత‌లు నివ్వేర‌పోయేలా త‌న‌దైన పద్ధ‌తితో మార్చేసిన ఈ ఘ‌నుడు ఎవ్వ‌రో కాదు.. ఆయ‌నే వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి. ఇంత‌కు భాజపా అంటే ఏమిటీ మ‌రి అనుకుంటున్నారా.. అదేనండీ.. భాజపా అంటే భార‌తీయ జ‌నతా పార్టీ కాదు.. బాబు జ‌నాల పార్టీ అట‌.

అరే బాగుందే.. భాజాపా అంటే ఇట్లా కూడా అర్థం చేసుకోవ‌చ్చా.. అక్క‌డ చెప్పింది ఎవ్వ‌ర‌నుకుంటున్నారు.. వైసీపీ ఎంపీ.. అది నిత్యం సోష‌ల్ మీడియాలో చురుకుగా, ప్ర‌త్య‌ర్థుల‌కు సెటైర్ల‌లో చెమ‌ట‌లు ప‌ట్టించే విజ‌య‌సాయిరెడ్డి. ఇంత‌కు బాబు జ‌నాల పార్టీగా ఎంపీ విజ‌యసాయిరెడ్డి ఎందుకు అన్నారు అనుకుంటున్నారు.. బీజేపీ రాజ్య‌స‌భ సభ్యుడు సుజ‌నాచౌద‌రి ప్రెస్‌మీట్ పెట్టారు. ఆయ‌న పెట్టిన ప్రెస్‌మీట్ లో టీడీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ను వెనుకేసుకురావ‌డంతో విజ‌య‌సాయిరెడ్డికి మండింది. ఆ మంట ఏకంగా ఎంపీ సుజ‌నాచౌద‌రిపైనా, చంద్ర‌బాబు, లోకేష్‌, అచ్చెంనాయుడు, చింత‌మ‌నేని, య‌న‌మ‌ల పైనా చూపాడు.

త‌న ట్వీట్ట‌ర్ ఖాతాలో విజ‌య‌సాయిరెడ్డి చేసిన ట్వీట్లు చూస్తుంటే భాజపా నేత‌ల‌కు మండిపోవాల్సిందే. విజ‌య‌సాయిరెడ్డి చేసిన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు.. సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపి) వేరు… అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్ధమయింది అని సెటైర్ వేశారు విజ‌య‌సాయిరెడ్డి. అంతే కాదు బాబు అండ్ టీం పైనా విజ‌య‌సాయి ఒంటికాలితో లేచారు.

మ‌రో ట్వీట్‌లో అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ నాయిడు, ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు, మహిళా రక్షణ మీద చింతమనేని, సంస్కారం మీద ఉమా, స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో… బ్యాంకు లూటీల భజనా చౌదరి ఏపి ప్రయోజనాల గురుంచి ప్రెస్ మీట్లు పెడితే కూడా అలాగే ఉంటుంది అంటూ ధ్వ‌జ‌మెత్తాడు. ఇప్పుడు విజ‌య‌సాయిరెడ్డి చేసిన ట్వీట్ ఏపీలో క‌ల‌క‌లం రేపుతుంది. భాజపాను బాబు జ‌నాల పార్టీగా మార్చి సంచ‌ల‌నం రేపాడు విజ‌య‌సాయి. మ‌రి బీజేపీ నేత‌లు విజ‌య‌సాయి ట్వీట్‌కు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version